📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆపన్నహస్తం

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆపన్నహస్తం
  • క్షతగాత్రులను సొంత వాహనంలో ఆసుపత్రికి తరలింపు.. వైద్యులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్సీ
అధికారిక పర్యటన నిమిత్తం ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. అదే మార్గంలో ఓ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో తీవ్రంగా గాయపడిన బాధితులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సొంత వాహనంలోనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ సహాయక చర్యల్లో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్యులను అప్రమత్తం చేసి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అంతేకాకుండా బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారికి అండగా నిలిచారు.
ప్రమాద సమయంలో స్పందించి క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించడం ద్వారా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారికి తక్షణ సహాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ఈ ఘటన చాటిచెప్పింది. వారితో జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు..