📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

నిర్మల్ నియోజకవర్గ సాగునీటి అభివృద్ధికి 1.26 కోట్లకు పైగా నిధులు మంజూరు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
నిర్మల్ నియోజకవర్గ సాగునీటి అభివృద్ధికి 1.26 కోట్లకు పైగా నిధులు మంజూరు
  • ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కృషితో నాలుగు కీలక సాగునీటి పనులకు నిధుల ఆమోదం
నిర్మల్ నవంబర్ 17,సాక్షర ప్రతినిధి
నిర్మల్ నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యాల మెరుగుదల, కాలువల మరమ్మతులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణకు సంబంధించి నాలుగు కీలక అభివృద్ధి పనులకు రూ.1.26 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
లక్ష్మణచందా, నిర్మల్ గ్రామీణ, సారంగాపూర్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో సాగునీటి సౌకర్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నిధులను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
మంజూరైన పనుల వివరాలు:
వడ్డ్యాల్ గ్రామ సమీపంలోని శ్రీరాంసాగర్ ప్రధాన కాలువపై 24.30 కిలోమీటర్ వద్ద సూపర్ పాసేజ్ పునర్నిర్మాణ పనులకు రూ.66 లక్షలు మంజూరు చేశారు.
రాచాపూర్ గ్రామ సమీపంలోని కాలువపై 21.90 కిలోమీటర్ వద్ద సూపర్ పాసేజ్ పునర్నిర్మాణ పనులకు రూ.39.40 లక్షలు కేటాయించారు.
ముజ్జి–సంగ్వి ఎత్తిపోతల సాగునీటి పథకంలో భాగంగా సంగ్వి గ్రామం వద్ద ఒత్తిడితో నీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్లలో లీకేజీల నివారణ, మరమ్మతు పనులకు రూ.17.20 లక్షలు ఆమోదించారు.
సారంగాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలోని చెరువు దిగువ భాగంలో ఉన్న తక్కువ ఎత్తు వంతెనకు అనుసంధానంగా ఉన్న రహదారికి శాశ్వత మరమ్మతు పనుల కోసం రూ.4.25 లక్షలు మంజూరు చేశారు.
ఈ నిధులతో సాగునీటి వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, కాలువల నిర్వహణను మెరుగుపరిచి రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా సాగునీటి సరఫరాలో అంతరాయాలు తగ్గి, వ్యవసాయ అవసరాలకు నీరు సక్రమంగా అందించేందుకు ఈ పనులు దోహదపడనున్నాయి.
నియోజకవర్గ అభివృద్ధితో పాటు రైతాంగ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సాగునీటి వనరులను పటిష్టం చేయడం, రైతుల సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా అవసరమైన నిధుల మంజూరుకు నిరంతరం కృషి చేస్తున్నామని, సాగునీటి రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.