అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
- నిబంధనలు ఉల్లంఘిస్తే కార్డుల రద్దు తప్పదు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా అక్రెడిటేషన్ కమిటీ మూడో విడత సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హతలు, నిబంధనల అమలుపై సమీక్షించారు.అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. దినపత్రికల ప్రతిరోజు ప్రచురణ, జర్నలిస్టుల హాజరు తదితర వివరాలను నిబంధనల ప్రకారం సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అర్హతలు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా అక్రెడిటేషన్ కార్డులు పొందినట్లు గుర్తిస్తే వాటిని రద్దు చేస్తామని హెచ్చరించారు.అలాగే అక్రెడిటేషన్ కార్డులను వ్యక్తిగత అవసరాలకు లేదా ఇతర అనుచిత ప్రయోజనాలకు దుర్వినియోగం చేసినా,నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కార్డులను వెనక్కి తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అక్రెడిటేషన్ కన్వీనర్ మెంబర్, డీపీఆర్ఓ ఇ.విష్ణువర్ధన్,కమిటీ సభ్యులు అల్వాల హనుమంతు, రవీందర్,మహేష్,రాజేశ్వర్,అశోక్, నాగరాజు,వసీం,ప్రేమ్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
